తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో, గంభీరమైన కంఠస్వరంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు రంగనాథ్ 1949 జూలై 17 న మద్రాసులో జన్మించారు. ఆయన పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో, గంభీరమైన కంఠస్వరంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, కవిగా, దర్శకుడిగా కూడా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.
సినిమాల్లోకి రాకముందు ఆయన రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేశారు.1969లో వచ్చిన 'బుద్ధిమంతుడు' చిత్రంలో ఒక చిన్న పాత్రతో ఆయన ప్రయాణం మొదలైంది. సుమారు 300 సినిమాలలో నటించారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయా నటుడిగా ప్రేక్షకులను మెప్పించారు.
1974లో వచ్చిన చందన చిత్రంతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పంతులమ్మ సినిమాతో స్టార్ హీరోగా మారారు. చదువు- సంస్కారం, జమీందార్ గారమ్మాయి, రామ చిలక, ఇంటింటి రామాయణం, అమెరికా అమ్మాయి, అందమే ఆనందం, దేవతలారా దీవించండి వంటి చిత్రాలు కూడా నటుడిగా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో తండ్రిగా, గురువుగా, పవర్‌ఫుల్ విలన్‌గా మెప్పించారు. దర్శకుడిగా మారి మొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు.
సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా రంగనాథ్ అలరించారు. పలు ప్రసిద్ధ తెలుగు ధారావాహికలలో కీలక పాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
ఆయన గంభీరమైన వాయిస్, స్పష్టమైన తెలుగు ఉచ్చారణ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చాయి.
ఆయనకు కవిత్వం రాయడం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం.ఎన్నో కవితలు, వ్యాసాలు రాశారు. ఇండస్ట్రీలో ఆయనను చాలా మృదుస్వభావిగా, విలువలతో కూడిన వ్యక్తిగా అందరూ గౌరవించేవారు.
భార్య చనిపోయిన తర్వాత రంగనాథ్ ఒంటరితనంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. 2015 డిసెంబర్ 19న హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు.*
No comments:
Post a Comment