Friday, 17 July 2026

సినీ ధ్రువతార సౌందర్య (జయంతి జూలై 18)




చలనచిత్ర పరిశ్రమలో, ప్రత్యేకించి తెలుగు సినీ రంగంలో సౌందర్య ఒక ధ్రువతార. కేవలం అందంతోనే కాకుండా అద్భుతమైన నటన, హుందాతనం, సాత్విక భావాలతో ప్రేక్షకుల హృదయాల్లో గౌరవాన్ని సంపాదించుకున్న నటి ఆమె.

సౌందర్య  1972 జూలై 18న కర్ణాటకలోని కోలార్ జిల్లా, ముల్బాగల్‌లో జన్మించారు. ఆమె అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. ఆమె తండ్రి కె.ఎస్. సత్యనారాయణ  కన్నడ చిత్ర నిర్మాత,  రచయిత.  ఆమె బెంగళూరులో వైద్య విద్య మొదటి సంవత్సరం చదువుతుండగా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. దాంతో చదువును మధ్యలోనే ఆపి సినీ రంగానికి వచ్చారు. 2003 ఏప్రిల్‌లో ఆమె తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జి.ఎస్. రఘు ను వివాహం చేసుకున్నారు.

1992లో కన్నడ చిత్రం గంధర్వ ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. తెలుగులో ఆమె మొదటి సినిమా మనవరాలి పెళ్లి (1993). ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు 12 ఏళ్ల కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో నటించారు.

 90వ దశకంలో సౌందర్య టాలీవుడ్‌లో తిరుగులేని నటిగా ఎదిగారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జగపతి బాబు వంటి అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు.

అమ్మోరు చిత్రానికి ఆమెకు ఉత్తమ నటిగా మొదటి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. పవిత్ర బంధంలో పాత్రకు ఉత్తమ నటిగా నంది అవార్డు లభించింది. అంతపురం చిత్రంలో ఆమె నటనకు ఫిలింఫేర్ మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. రాజా చిత్రానికి గాను మరోసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ద్వీప కన్నడ సినిమాను ఆమె స్వయంగా నిర్మించి, నటించారు. దీనికి కేంద్ర ప్రభుత్వ జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం లభించింది. 

31 ఏళ్ల వయసులోనే  2004 ఏప్రిల్ 17న హెలికాప్టర్  ప్రమాదంలో ఆమెజీవితంవిషాదాంతంఅయింది.*

 


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...