Friday, 17 July 2026

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

 హైదరాబాద్: శుక్రవారం సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. 

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. వివిధ శాఖల అధికారులు, నిపుణులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

గ్రామ పంచాయతీల సొంత ఆదాయం పంచాయతీ ఖాతాలోనే జమ చేయాలనే నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

టెండర్ ప్రక్రియ కోసం ప్రత్యేక చట్టం, విధివిధానాల సిఫార్సుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ట్రాన్స్ జెండర్ను కో-ఆప్షన్ సభ్యులుగా నియమించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో మిగిలిన పనులకు డీపీఆర్ తయారు చేయాలని నిర్ణయించింది.

—


No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...