హైదరాబాద్: చైనా లోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఏషియా అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2026 లో మహిళల 4x400 రిలే పరుగుపందెంలో స్వర్ణ పతకం సాధించిన ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
నల్గొండలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొంది అంతర్జాతీయ వేదికపై రాణించిన ప్రవల్లిక యువ క్రీడాకారులు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని రేవంత్ ప్రశంసించారు.
ఏషియా అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 4x400 మీటర్ల రిలే జట్టులో శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖతూన్‌లతో కలిసి ప్రవల్లిక స్వర్ణ పతకం సాధించారు. ఈ నలుగురు సభ్యుల బృందం 3:33.62 సెకన్ల సమయంతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని, ఆతిథ్య దేశమైన చైనాను అధిగమించింది.
ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా 3 స్వర్ణ, 4 రజత, 9 కాంస్య పతకాలతో సహా 16 పతకాలను సాధించిన భారత క్రీడాకారులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
No comments:
Post a Comment