Monday, 20 July 2026

కాక్రోచ్ జనతా పార్టీ 'చలో పార్లమెంట్' ఉద్రిక్తం: లాఠీఛార్జి, అరెస్టులు

న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం నిర్వహించిన  'చలో పార్లమెంట్' నిరసన ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున తలపెట్టిన ఈ మార్చ్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకొనేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ.. భారీ సంఖ్యలో నిరసనకారులు బారికేడ్లను దాటుకొని పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. సుమారు 70మందిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులు రాళ్ళు రువ్వడంతో వందమందికి పైగా పోలీసులు గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు వర్షాకాల సమావేశాల తొలిరోజున పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టాయి.


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...