అమెరికాతో కుదిరిన ఒప్పందం నుంచి వైదొలిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ నౌకాశ్రయాలపై మళ్లీ దిగ్బంధనం విధిస్తూ మంగళవారం రాత్రి ఏడు గంటల పాటు అమెరికా చేసిన దాడుల్లో ఏడుగురు సైనికులు మృతిచెందారు. సిస్తాన్, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ట్యాంకులు, సాయుధ వాహనాలను నడిపే ఇరాన్‌కు చెందిన 388వ మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ బ్యారక్స్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడి చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లపై ఐఆర్జీసీ దళాలు క్షిపణుల వర్షం కురిపించాయి. 3 ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ తెలిపింది. అమెరికా దిగ్బంధనానికి ప్రతీకారంగా హర్మూజ్‌తో పాటు పశ్చిమాసియాలో మరిన్ని వాణిజ్య మార్గాలను అడ్డుకుంటామని ఐఆర్జీసీ, హెచ్చరించింది.అమెరికా, దానిమిత్రదేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే ఇతర చమురు, సహజ వాయువు ఎగుమతి మార్గాలను కూడా మూసివేస్తామని కూడా తెలిపింది. అమెరికా తన దురాక్రమణ చర్యలను విడనాడేంత వరకు హర్మూజ్ జలసంధి మూసివేసే ఉంటుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేసింది.
No comments:
Post a Comment