Monday, 20 July 2026

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభం

హైదరాబాద్: రాజధానిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఉన్న కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ , శ్రీధర్‌బాబు, అజారుద్దీన్‌ ప్రారంభించారు. క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నామని గజం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఉన్న ప్రాంతంలో కూడా ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, 525 చదరపు అడుగులు ఉండేలా ప్లాట్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. క్యూర్ పరిధిలో ఫ్లాట్ల కోసం ఆగస్టు 10 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. మీసేవ, వాట్సప్, వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100, ఈఎండీ రూ.10 వేలు ఉంటుంది. ఫ్లాటు రాని వారికి ఈఎండీ రూ.10 వేలు తిరిగి చెల్లిస్తారు. ఫ్లాటు పదేళ్ల పాటు అమ్మరాదని అద్దెకు ఇవ్వరాదని షరతు ఉంది. కుటుంబంలో ఒకరికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. క్యూర్ పరిధిలో ఇల్లు, స్థలం లేని వారికి తొలివిడతలో ప్రాధాన్యం ఇస్తారు.


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...