Sunday, 12 July 2026

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

గులేబకావళి కథ (1962)

1962 సంవత్సరంలో విడుదలైన జానపద చిత్రం ‘గులేబకావళి కథ‘ సినిమా చరిత్రలో సంచలనంగా నిలిచింది.ఈ చిత్రాన్ని నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై నందమూరి త్రివిక్రమరావు నిర్మించారు. 

పాటలీపుత్ర మహారాజు (ముక్కామల) కి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య (ఋష్యేంద్రమణి) ఒక సిద్ధుని వరంచేత గర్భవతి అవుతుంది. పెద్ద భార్యకు కలిగే సంతానం/బిడ్డ వల్ల తనకు చూపు పోతుందని జోతీష్యులు ద్వారా తెలుసుకున్న మహారాజు ఆమెను అడవులకు పంపిస్తాడు. అక్కడ ఆమెకు జన్మించిన కుమారుడు విజయుడు (రామారావు), కోయగూడెంలో పెరిగి పెద్దవాడవుతాడు. రెండవ భార్య (ఛాయాదేవి) ద్వారా ముగ్గురు కొడుకులు కలుగుతారు. 

రెండవ భార్య తమ్ముడు వక్రకేతు (రాజనాల) రాజ్యాధికారం కోసం ఎత్తులు వేస్తుంటాడు, తన పన్నాగాలతో అక్క కొడుకులను మూర్కులుగా పెంచుతాడు.  మహారాజుకు కంటిచూపు లేకుండా చేస్తాడు. అయితే ఔషధ గుణాలున్న 'గులేబకావళి' పుష్పం తెచ్చి కన్నులకు తాకిస్తే కంటిచూపు వస్తుందని రాజావైద్యులు ద్వారా తెలుసుకున్న మహారాజు, ఆ పుష్పం తెచ్చి తనకు కంటిచూపు తెప్పించిన వారికి తన రాజ్యం పుష్పం తేవడానికి చిన్న భార్య మూర్ఖులైన  ముగ్గురు కొడుకులూ బయలుదేరతారు అలాగే తన జన్మ రహస్యం తెలుసుకున్న పెద్ద భార్య కుమారుడు విజయుడు కూడా ప్రయాణమవుతాడు. మధ్యలో యుక్తమతి (జమున) వేసిన పావుల పందెంలో విజయుడి అన్నలు ముగ్గురు ఓడిపోయి బందీలవుతారు. విజయుడు మారువేషంలో పందెంలో పాల్గొని ఆమెను ఓడిస్తాడు. ఫలితంగా ఆమె తన మనస్సును విజయునికి అర్పించి బందీలుగా ఉన్న వారిని విడుదల చేస్తుంది. విజయుడు గులేబకావళి పుష్పాన్ని సాధించి తెస్తుండగా సోదరులు kuyయుక్తితో దానిని తస్కరించి విజయుడిని బావిలో పడవేసి రాజ్యానికి చేరతారు, రాజ్యానికి వచ్చిన అన్నల పెట్టెలో పుష్పానికి బదులు చీపురు కట్ట వుండటం చూసి ఆశ్చర్యపోతారు. బావిలోంచి బయటపడ్డ విజయుడు ఒక తాపసి సహాయంతో తిరిగి గులేబకావళి పుష్పాన్ని సాధించడమే కాక ఆ పుష్పవృక్షాన్ని రక్షిస్తున్న గందరవ్వుని కుమార్తె అయిన కావళి (నాగరత్నం) ని పెళ్ళిచేసు కొంటాడు. విజయుడు సమయానికి వచ్చి తండ్రికి చూపు తెప్పించడమే గాక వక్రకేతుతో పోరాడి అతన్ని అంతమొందిస్తాడు.

ఎన్.టి.రామారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించినప్పటికీ టైటిల్స్ లో ఆయన పేరు ఉండదు. ఈ చిత్రానికి సముద్రాల కథ, మాటలు అందించగా జోసెఫ్, విజయా కృష్ణమూర్తి సంగీతం అందించారు. ఈ చిత్రం ద్వారా సి. నారాయణ రెడ్డి సినీ గేయ రచయితగా ప్రస్థానం ప్రారంభించారు. ఆయన రాసిన నన్ను దోచుకుందువటే పాట బహుళ ప్రజాదరణ పొందింది. కలల అలలపై, మదన సుందర నా దోరా, ఒంటరినై పోయాను పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి *

No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...