జూలై 30న మరణించిన ప్రముఖ దక్షిణ భారత సినీ నేపథ్య గాయని కోకా జమునా రాణి (88) 1938 మే 17న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. జమునా రాణి తన తల్లి ద్రౌపది (వైలిన్ విద్వాంసురాలు) ప్రోత్సాహంతో చిన్ననాటి నుంచే సంగీతం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. కేవలం 7 ఏళ్ల వయసులోనే (1946) 'త్యాగయ్య' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ భాషలలో కలిపి సుమారు 6,000కు పైగా పాటలు పాడారు. ఆమె పాడిన పాటల్లో నాగమల్లి కోనలొన, సరదా సరదా సిగరెట్టు, ఎంత టక్కరి వాడు నారాజు, ముక్కుమీద కోపం.. నీ ముఖానికే అందం, కోటు బూటు వేసిన బావ వచ్చాడయ్యా, పదపదవె వయ్యారి గాలిపటమా, రావాలి రావాలి, మామ మామ పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.
సింహళ సినిమాల్లో ఆమె పాడిన కొన్ని పాటలు అక్కడ ఎంతో ప్రజాదరణ పొంది, ఆల్-టైమ్ క్లాసిక్స్‌గా నిలిచాయి.
తమిళ సినీ రంగానికి చేసిన సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం నుంచి 'కలైమామణి' పురస్కారంతో పాటు అన్నాదురై పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
No comments:
Post a Comment