న్యూఢిల్లీ: 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 డిసెంబర్ దాకా సెన్సార్ అయిన సినిమాలను ఈ అవార్డులో పరిగణించారు. ఇందులో తెలుగు నుంచి ఉత్తమ కథా చిత్రంగా కొణిదెల నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రాళ్లు' సినిమాకు అవార్డు దక్కింది. ఉత్తమ నటుడి అవార్డును మలయాళ స్టార్ హీరో మమ్మూట్టి (భ్రమయుగం), కార్తిక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) సంయుక్తంగా దక్కించుకున్నారు. ఉత్తమ నటి అవార్డును యామి గౌతమి (ఆర్టికల్ 370) సొంతం చేసుకున్నారు. అవార్డుల వివరాలు:
- ఉత్తమ తెలుగు చిత్రం - కమిటీ కుర్రోళ్లు
- ఉత్తమ పాపులర్ చిత్రం - కల్కి 2798 ఏడీ
- ఉత్తమ బాలల చిత్రం - 35 చిన్న కథ కాదు
- ఉత్తమ మేకప్ - పి.రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు)
- బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ (ఒరిజనల్) - సుకుమార్ (పుష్ప-2)
- బెస్ట్ డైలాగ్ రైటర్ - వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ - దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప-2)
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ - నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2798 ఏడీ)
- ఉత్తమ చిత్రం - ఆర్టికల్ 370
- ఉత్తమ నటుడు - మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ (ఇద్దరికీ)
- ఉత్తమ నటి - యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
- ఉత్తమ దర్శకుడు - రాజ్‌కుమార్ పెరియస్వామి (అమరన్)
- ఉత్తమ నేపథ్య గాయని - వైకోం విజయలక్ష్మి (ఏఆర్‌ఎం)
- ఉత్తమ నేపథ్య గాయకుడు - అభయ్ జోధ్ పుర్కర్
- బెస్ట్ సినిమాటోగ్రఫర్ - జలాల్ (భ్రమయుగం)
- ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం - కెప్టెన్ మిల్లర్ (తమిళం)
- బెస్ట్ ఎడిటర్ - కలైవన్నన్ (అమరన్)
- బెస్ట్ సౌండ్ డిజైనర్ - మానస్ చౌదరి (భూల్ బులియా)
- బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ - యోగేశ్ దేశ్‌పాండే
- ఉత్తమ పాటల రచయిత – మనోజ్ ముంతాసిర్ (మైదాన్)
- ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ – జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్)
- ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) - శశ్వంత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)
- ఉత్తమ తమిళ చిత్రం - రాయన్
- ఉత్తమ మలయాళ చిత్రం - ఫెమినిస్ట్ ఫాతిమా
- ఉత్తమ కన్నడ చిత్రం - మిథ్య (ఇల్యూజన్)
- ఉత్తమ హిందీ చిత్రం - శ్రీకాంత్
- ఉత్తమ గుజరాత్ చిత్రం - మారన్ (ద హంట్)
- ఉత్తమ బెంగాలీ చిత్రం - చల్‌చిత్ర ఎఖో
- బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ - సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ)
- సినిమాలపై ఉత్తమ పుస్తక రచయిత – ప్రదీప్‌కుమార్ శెట్టి (కన్నడ)
- నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: స్పెషల్ మెన్షన్ - ద చోలా డోరా ఔర్ సూయి
- నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: స్పెషల్ మెన్షన్ - భద్రకాళి నాటకం
- నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ స్క్రిప్ట్ - ఓబుర్
- నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ సినిమాటోగ్రఫీ - లైవ్ ఇన్ లూమ్
- నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ డైరెక్షన్ - ఆనంద్ రాయ్ (స్టాట్యూ ఆఫ్ యూనిటీ)
- నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ డాక్యుమెంటరీ - రామ్ నమీ
- స్పెషల్ మెన్షన్ - మేయళగన్ (తమిళం)
- స్పెషల్ మెన్షన్ - తమిళ చిత్రం కెప్టెన్ మిల్లర్ (ధనుష్)
No comments:
Post a Comment