-Jeedigunta Nageswara Rao
శనివారం మైసూరులో కన్ను మూసిన శిష్టా జానకి ( ఎస్.జానకి) (88) గాన కోకిలగా, దక్షిణ భారత నైటింగేల్ గా సుపరిచితులు.1938
ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లపట్ల గ్రామంలో జన్మించిన జానకి తన సుదీర్ఘ కెరీర్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 50 వేలకుపైగా పాటలు పాడారు. తొలితరం ఘంటసాల నుంచి మలితరం బాలబాలసుబ్రమణ్యం దాకా ఆమె అద్భుత గీతాలు ఆలపించారు.
జానకి ప్రత్యేకత ఆమె వాయిస్ మాడ్యులేషన్. పసిపాప గొంతునుంచి వృద్ధురాలి గొంతు వరకు, ఎలాంటి పాత్రకైనా ఆమె తన గొంతుతో ప్రాణం పోయగలరు. ముఖ్యంగా శృంగార రస ప్రధానమైన పాటలు, విషాద గీతాలు, జోలపాటలు పాడటంలో ఆమె శైలి అద్వితీయం.
ఇళయరాజా సంగీతానికి ఆమె పాడిన పాటలు ఒక ట్రెండ్ సృష్టించాయి. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన వేలాది యుగళ గీతాలు దక్షిణ భారత సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.
2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును ఆమె నిరాకరించారు. దక్షిణ భారత కళాకారులకు దక్కాల్సిన గుర్తింపు ఆలస్యంగా లభిస్తోందని, ఈ పురస్కారం తనకు చాలా ఆలస్యంగా వచ్చిందని ఆమె గౌరవపూర్వకంగా దానిని తీసుకోలేదు.
ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం పొందారు. 33 ఫిల్మ్ అవార్డులు కూడా లభించాయి. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్.
ఆమె 2016లో అధికారికంగా సినిమాలకు పాటలు పాడటం విరమించుకున్నారు అయినా ఆమె పాడిన వేలాది పాటలు ఎప్పటికీ సంగీతాభిమానుల హృదయాల్లో మ్రోగుతూనే ఉంటాయి.*
No comments:
Post a Comment