నేనంటే నేనే (1968)
సుజాత ఫిలిమ్స్ బేనర్‌పై సుజాత ఫిలిమ్స్ బేనర్‌పై పి.మల్లిఖార్జునరావు 1968లో వచ్చిన ‘నేనంటే నేనే‘ చిత్రం విజయవంతమయిన చిత్రంగా, హీరో కృష్ణ కు మరో సక్సెస్ చిత్రంగా నిలిచింది. పీ. మల్లిఖార్జునరావు నిర్మించిన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఓరుగంటి రామచంద్రరావు దర్శకత్వం వహించారు. భమిడిపాటి రాధాకృష్ణ మాటలు రాశారు.
ఈ సినిమానూ 1967లో విడుదలైన ‘నాన్‘ అనే తమిళ చిత్రం ఆధారంగా నిర్మించారు. తరువాత 1969 లో నిర్మాత వాసూమీనన్ వాసు స్టూడియోస్ బేనర్‌పై టి రామన్న దర్శకత్వంలో ‘వారిస్‘ పేరుతో ఈ చిత్రాన్ని హిందీలో తీశారు. మొత్తం మూడు భాషల్లోనూ ఈ చిత్రం విజయం సాధించింది.
రంగాపురం రాజా రఘునాథరావు (జూనియర్ సుబ్బారావు) కొడుకు కుమార్‌రాజా(చంద్రమోహన్). అతని పుట్టినరోజు పార్టీకి పిలిచిన స్నేహితులను తండ్రి వెళ్ళగొడతాడు. దాంతో తండ్రిపై కోపంతో కుమార్ ఎస్టేటు విడిచి వెళ్లిపోతాడు. రంగూన్లో కామాక్షమ్మ (జూ.శ్రీరంజని)వద్ద పెరిగి పెద్దవాడవుతాడు. ఆమె తన సొంత కొడుకు ఆనంద్ (కృష్ణంరాజు)కంటే కుమార్ (చంద్రమోహన్)ను ఎక్కువగా అభిమానిస్తుంది. బంగ్లా నుంచి కుమార్ వెళ్లిపోయాక రాజా రఘునాథరావుకు ఒక కుమార్తె జన్మిస్తుంది. తరువాత రాణీ మరణించటం, కుమార్ ఎంత కాలానికీ ఇంటికి తిరిగి రాకపోవటంతో రాజా రఘునాథరావు బెంగ పెట్టుకుంటాడు. తన ఆస్తిని నమ్మకమైన ముగ్గురు ట్రస్టీలు ఉద్దండం (వి రామచంద్రరావు), సుకుమారి (సూర్యకాంతం), బాజాలు (కెవి చలం), దివాన్ (రావికొండలరావు)కు అప్పగిస్తూ కుమార్ వివరాలు అందచేస్తాడు. కుమార్ ఆచూకీ తెలుసుకుని ఆస్తిని, చెల్లెలు సరళ (సంధ్యారాణి) ని అప్పగించమని కోరతాడు. అలాగే దివాన్ ( రావి కొండల రావు) కుమార్తె గీత (కాంచన)తో కుమార్‌కు వివాహం జరిపించమని కోరుతూ మరణిస్తాడు. రఘునాథరావు మరణించటంతో తానే రాజ్‌కుమార్ అంటూ ఆనంద్ (కృష్ణంరాజు), శేఖరం (కృష్ణ), భూషణం (నాగభూషణం) బంగళాకు వస్తారు. వీరికితోడు భూపతి (నెల్లూరి కాంతారావు) అనే పెద్ద గుండా తన ముఠాతో ఆనంద్‌కు అండగా వుండి ఆస్తి కాజేయాలని కుట్రలు పన్నుతాడు. ఆ క్రమంలో కుమార్ (చంద్రమోహన్)ను బంధిస్తారు. మరోవైపు గీత శేఖర్ తో ప్రేమలో పడుతుంది. కథ పలు మలుపులు తిరిగి శేఖర్, భూషణం కలసి అసలైన వారసుడు కుమార్ గా బయటపెడతారు.
ఈ చిత్రానికి సంగీతం ఎస్. పి. కోదండపాణి సమకూర్చారు. ఓ చిన్నదాన నన్ను విడిచి పోతావుటే - పాట కృష్ణకూ, బాలూకూ కూడా పేరు తెచ్చిపెట్టింది. వానలో, కారులో కృష్ణ, కాంచనపై చిత్రీకరించిన చాలదా ఈ చోటు - పాట కూడా పాపులర్ అయింది. తల్లీకొడుకులుగా నాగభూషణం ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణ. కృష్ణంరాజు విలన్ గా రాణించాడు.
No comments:
Post a Comment