Monday, 7 September 2026

 బందిపోటు (1963)


జానపద బ్రహ్మ బీ. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన మరో పవర్ ఫుల్ జానపదం ‘బందిపోటు‘. రాజ్యలక్ష్మి బ్యానర్ పై సుందర్ లాల్  నహతా, డూండీ నిర్మించిన బందిపోటు సినిమా 1963, ఆగష్టు 15న విడుదల అయింది. కథ, మాటలు త్రిపురనేని మహారది అందించారు. 

గాంధార రాజు సత్యసేన భూపతి ( గుమ్మడి). అతని బావమరిది శూరసింహుడు ( రాజనాల) సేనాపతిగా పంట లెత్తుకుపోవడం, బల్లేలకి పసి పిల్లల్ని మిడుతల్లా గుచ్చి ఆనందించడం, ఆడవాళ్ళని చెరచడం, మగవాళ్ళని చంపడం వంటి అకృత్యాలతో రాజుకి చాలా చెడ్డ పేరు తెస్తూంటాడు. రాజు కూతురు మందారమాల (కృష్ణకుమారి) పరమఅహంకారి. రాజ్యం మీదా, రాకుమారి మీదా శూరసింహుడు కన్నేస్తాడు.పంట లెత్తుకుపోవడం, బల్లేలకి పసి పిల్లల్ని మిడుతల్లా గుచ్చి ఆనందించడం, ఆడవాళ్ళని చెరచడం, మగవాళ్ళని చంపడం వంటి అకృత్యాలతో రాజుకి చాలా చెడ్డ పేరు తెస్తూంటాడు. సేనాపతి వల్ల నష్ట పోయిన వీర నాయక (మిక్కిలినేని) అసహాయ సూరుడుగా చెప్పుకుంటూ ముసుగు దొంగ వేషంలో ఖజానాని దోచి పేదలకి పంచి పెడుతూంటాడు. కీచక రాజభటుల్ని వధిస్తూంటాడు. ఈ అవకాశంతో శూరసింహుడు తన దురాగతాల్ని ఇతడికే అంటగట్టి, రాజుకి ఫిర్యాదు చేస్తూంటాడు. ఒకసారి నరసింహ అనే యువ రైతు ( ఎన్టీఆర్) అసహాయశూరుడ్ని అటకాయిస్తే, అతడు తన చిన్నాన్న అని తెలుస్తుంది. అటు రాజుకి కూడా ఈ రహస్యం తెలిసి ఆ అసహాయశూరుడ్ని విచారణకి తన ఎదుట ప్రవేశపెట్టాల్సిందిగా అతడి అన్న ధర్మనాయకుణ్ణి (నాగయ్య) ఆదేశిస్తాడు. ఈలోపు నిజాలు బయట పడకూడదని శూరసింహుడు అసహాయశూరుడ్ని చంపించేస్తాడు. ఈ అఘాయిత్యానికి గుండె పగిలిచస్తాడు ధర్మనాయకుడు. తండ్రి, చిన్నాన్న మరణంతో నరసింహ ఆగ్రహంతో శూరసింహుడి మీద పగబడ్తాడు. బందిపోటు వేషంలో అతడి అకృత్యాలను ఎదుర్కొంటాడు. రాకుమారి ప్రేమ పొంది ఆమె అహంకారాన్ని అణచివేస్తాడు. అయితే తన పోరాటంలో చివరికి ఉరి కంబమెక్కుతాడు. మరో వైపుదుష్టనాయకుడు శూరసింహుడు, రాజుని బంధించి తన పట్టాభిషేక సంబరాల్ని ఘనంగా జరుపుకుంటూంటాడు. అప్పుడు తప్పించు కొచ్చిన బందిపోటు నరసింహ, ఆ పట్టాభిషేక ఉత్సవాల్లో యుక్తిగా శూర సింహుడిని అంతమొందిస్తాడు.

ఘంటసాల సంగీతం అందించిన ఈ చిత్రంలో ఆరుద్ర రాసిన ఊహలు గుసగుసలాడే, సినారే రాసిన వగల రాణివి నీవే పాటలు నాటికీ నేటికీ బహుళ ప్రజాదరణ పొందాయి. 

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడంలో కూడా ఒకే సమయంలో ‘వీరకేసరి‘ పేరుతో నిర్మించారు. అందులో రాజ్ కుమార్ హీరో.

No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...