అక్కా చెల్లెలు (1970)
ఎం.ఏ.తిరుముగం దర్శకత్వంలో శాండో చిన్నప్పదేవర్ 1969లో నిర్మించిన అక్కై తంగై తమిళ సినిమా రీ మేక్ గా 1970 జనవరి ఒకటిన విడుదలైన అక్కా చెల్లెలు చిత్రం మహిళా చిత్రంగా ఆదరణ పొందింది.
జగపతి బ్యానర్ పై వీబీ రాజేంద్ర ప్రసాద్, వీ కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని సంజీవి దర్శకత్వం వహించారు. వీసి గుహనాధన్ కథకు ఆత్రేయ మాటలు రాశారు.
పేరున్న న్యాయమూర్తి రామచంద్రరావు (ఏఎన్ ఆర్). అతని తల్లి జయమ్మ శాంతకుమారి ). తమ్ముడు వేణు (కృష్ణ ). ఆ కుటుంబానికి ఆప్తుడు, కోర్టులో గుమస్తా ధర్మయ్య (గుమ్మడి ). ఊళ్లో కాయకష్టం చేసుకుంటూ చెల్లెలు విజయ (విజయనిర్మల)ను పట్నంలో లా చదివించే అమాయక, నిజాయితీ యువతి జానకి (షావుకారు (జానకి). పట్నంలో చదువుతున్న వేణు, విజయ ప్రేమించుకుంటారు. జానకి, నిజాయితీ, మంచితనం నచ్చిన రామచంద్రరావు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. అంతకుముందు ఓ స్రీని హత్య చేస్తున్న అంతకుముందు ఓ స్రీని హత్య చేస్తున్న వ్యక్తిని విజయ అనుకోకుండా చూస్తుంది. తరువాత అక్కకు కాబోయే భర్త, తనకు కాబోయే బావే.. తానుచూసిన హంతకుడని గ్రహిస్తుంది. అక్క పెళ్లి జరిగాక, అతనిని కోర్టులో దోషిగా ఆరోపణ చేస్తుంది. అన్న తరపున వేణు లాయర్‌గా నిలబడతాడు. కేసును పరిశోధించి, తన అన్న రామచంద్రరావు హంతకుడు కాదని నిరూపిస్తాడు. తమ కుటుంబం పై పగ బట్టిన తోటమాలి ( ఆనంద్ మోహన్) తన అన్నతోపాటు జన్మించిన కవల సోదరుడు రాజా( ఏఎన్ఆర్) ను చిన్నప్పుడే అపహరించి అతని చేత చెడ్డ పనులు చేయిస్తున్నట్టు , ఆ హత్య రాజా చేసినట్టు వేణు నిరూపిస్తాడు. కవల బిడ్డను కోల్పోయిన బాధను తప్పించడానికి, ధర్మయ్య అనాథాశ్రమం నుంచి వేరొక బిడ్డను తీసుకురాగా, శాంతమ్మ అతడిని పెంచిందని, ఆ బిడ్డే వేణు అని తెలుస్తుంది . రాజా పశ్చాత్తాపంతో జైలుకి వెళతాడు.
కే వీ మహదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ బావుంటాయి. ముఖ్యంగా సుశీల పాడిన, జానకిపై చిత్రీకరించిన పాండవులు పాండవులు తుమ్మెద పాట సినిమాకు హైలెట్. కృష్ణ, విజయనిర్మల కు ఘంటసాల,సుశీల పాడిన రెండు యుగళ గీతాలూ- శ్రీమతి ఏమన్నా, చిటాపటా చినుకులతో- కూడా హిట్. విజయలలితకు సుశీల పాడిన చకచకలాడే పడుచుంది, సంతోషం చేసుకుందాం నాతో ఉంటావా- పాటలు కూడా ఇప్పటికీ రేడియోలో వింటుంటాం.
No comments:
Post a Comment