ఆత్మ బలం (1964)
ఉత్తమ్‌కుమార్ నటించిన ‘అగ్ని సంస్కార’ సినిమా కలకత్తాలో చూసి నచ్చిన నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ అప్పటికప్పుడు ఆ చిత్ర నిర్మాతను కలిసి హక్కులు కొనేశారు. ప్రింట్ తీసుకుని మద్రాసులో దిగిన ఆయన దానిని అక్కినేనికి చూపించి ఆయన ‘ఓకే’ అనడంతో తన జగపతి బ్యానర్ పై రెండో చిత్రాన్ని ప్రారంభించారు. అదే ‘ఆత్మ బలం‘ సినిమా. 1964లో విడుదలైన ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచింది.
కుమార్ (జగ్గయ్య) ఒక ధనికుల కుమారుడు. అతను చిన్నప్పటినుండి తనకు కావలసినదానిని ఇతరులు పొందితే సహించలేని మనస్తత్వం కలిగినవాడు. వారి ఎస్టేటులో పని చేసే జయ ( బీ సరోజ) అంటే అతనికి ఇష్టం. అయితే జయ ఆనంద్ (అక్కినేని నాగేశ్వరరావు)తో ప్రేమలో పడుతుంది. ఇది భరించలేని కుమార్ తను ఆత్మహత్య కు ప్రయత్నించి చేసుకొని ఆ నేరం ఆనంద్‌పైకి వచ్చేలా చేస్తాడు. ఫలితంగా ఆందుకు ఉరిశిక్ష పడుతుంది. ఒక మానసిక వైద్యుని (గుమ్మడి) సహాయంతో, ఆత్మబలంతో ఉరికంబందాకా వెళ్ళిన ఆనంద్‌ను జయ కాపాడుకోవడం ఈ సినిమా కథ.
బినొయ్ ఛటర్జీ కథకు వీ మధుసూదన రావు చిత్రానువాడం చేసి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఆత్రేయ మాటలు, పాటలు, మహదేవన్ సంగీతం పెద్ద అసెట్. ఇప్పటికీ నాలుగు చినుకులు పడితే నలుగురి నోటా పలికే ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే‘ పాట ఈ చిత్రానికి పెద్ద లాండ్ మార్క్. ఇంకా బుల్లి కారున్న, పరుగులు తీసే, ఎక్కడికీ పోతావు, తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు, నాలుగు కళ్ళూ రెండయినాయి - పాటలు కూడా నేటికీ ఆదరణ కలిగి ఉన్నాయి.*
No comments:
Post a Comment