హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు. స్థానికులు డయల్ 100కు ఇచ్చిన సమాచారంతో కొత్తూరు మండలం పెంజర్ల వద్ద రాజ్‌కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్‌ను గుర్తించారు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. రాజ్‌కుమార్ మృతదేహం వద్ద సెల్‌ఫోన్ పోలీసులు గుర్తించారు. హత్యలకు ముందే రాజ్‌కుమార్ ఫోన్‌లో వీడియో రికార్డు చేసుకున్నట్లు గుర్తించారు. బాలిక కుటుంబసభ్యులు అన్ని విధాలుగా వాడుకుని మోసం చేశారని, అమ్మాయిని నమ్మి మోసపోయానని వీడియోలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, అప్పుల వల్ల జీవితంపై విరక్తి చెందినట్లు, అప్పుల వల్ల భూమి కూడా కోల్పోయానని, తన పిల్లలకు భూమి కూడా లేకుండా పోయిందని రాజ్‌కుమార్ వీడియోలో తెలిపారు. తనపై పోక్సో కేసు పెట్టారని బాలిక, బాలిక తల్లి, నానమ్మను నిందితుడు రాజ్‌కుమార్ శుక్రవారం రాత్రి హతమార్చాడు. అనంతరం ఇంటికి వెళ్లి భార్య సరిత, ఇద్దరు కుమారులను హత్యచేశాడు. అనంతరం అక్కడనుంచి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకొనేందుకు 12 పోలీసు బృందాలు ముమ్మరంగా గాలించాయి. చివరకు కొత్తూరు సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు.
Subscribe to:
Post Comments (Atom)
పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?
రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...
-
ముంబై:ప్రముఖ నటుడు ప్రదీప్‌సింగ్ రావత్ (74) ముంబయిలోని నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆయన నటించారు. సై, ఛ...
-
హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఈసారి తాను బాధ్యత తీసుకుంటానని పార్టీ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ యువత...
-
షిర్డీ సాయిబాబా తొలితరం భక్తులలో నానాసాహెబ్ డెంగ్లే ఒకరు. ఆయన షిర్డీకి సమీపంలోని నీంగావ్ గ్రామానికి చెందిన సంపన్న జమీందారు. బాబా దైవత్వాన్న...
No comments:
Post a Comment