Sunday, 19 July 2026

ఫిఫా వరల్డ్ కప్ (సంపాదకీయం)

 ఫిఫా వరల్డ్ కప్ కేవలం ఆట మాత్రమే కాదు, ప్రపంచాన్ని ఏకం చేసే భావోద్వేగం!

ప్రపంచంలో ఎన్నో క్రీడలు ఉన్నప్పటికీ, సాకర్ (ఫుట్‌బాల్) ప్రపంచాన్ని ఉర్రూతలూగించినట్లు మరే క్రీడ కూడా చేయలేదు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఫిఫా ప్రపంచ కప్  కేవలం ఒక క్రీడా టోర్నమెంట్ మాత్రమే కాదు. అది ఖండాల సరిహద్దులను దాటి, జాతి, కుల, మత భేదాలను తుడిచివేసే ఒక మహా ఉత్సవం.

ఫుట్‌బాల్ మైదానంలో ఆడే 90 నిమిషాలు ప్రపంచమంతా ఒకే శ్వాసగా మారుతుంది. ఒక చిన్న బంతి చుట్టూ కోట్లాది మంది ఆశలు, ఆరాటాలు, ఆనందభాష్పాలు ముడిపడి ఉంటాయి. గెలిచిన దేశంలో మిన్నంటే సంబరాలు, ఓడిన దేశంలో వ్యక్తమయ్యే భావోద్వేగాలు క్రీడల పట్ల ప్రజలకున్న తిరుగులేని అభిమానానికి నిదర్శనం. అమెరికా నుంచి అర్జెంటీనా వరకు, ఆఫ్రికా నుంచి  ఆసియా వరకు ప్రతి ఇల్లూ ఒక స్టేడియంగా మారిపోతుంది.

వరల్డ్ కప్ అందం ఎక్కడుందంటే—ఎప్పుడు ఏ చిన్న జట్టు పెద్ద జట్టును ఓడిస్తుందో ఊహించడం కష్టం. పటిష్టమైన బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, అర్జెంటీనా వంటి జట్లకు సైతం చెమటలు పట్టించేలా చిన్న దేశాలు ఆడే తీరు అద్భుతం.

కెనడా, మెక్సికో యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ప్రస్తుత టోర్నీ, ఫుట్‌బాల్ చరిత్రలోనే మొదటిసారిగా 48 జట్లతో అత్యంత భారీ స్థాయిలో జరిగింది. 

విజేత స్పెయిన్ జట్టు టోర్నీ అంతటా అత్యంత పటిష్టమైన డిఫెన్స్, మైదానాన్ని శాసించే పాసింగ్ గేమ్‌తో దూసుకుపోయింది. నాకౌట్ స్టేజ్‌లో ఆస్ట్రియా (3-0), పోర్చుగల్ (1-0), బెల్జియం (2-1), సెమీ-ఫైనల్లో ఫ్రాన్స్‌ (2-0) వంటి బలమైన జట్లను ఓడించి ఫైనల్‌కు చేరింది.  

 డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా ఎంతో పట్టుదలతో ఆడింది. నాకౌట్ పోరులో కేప్ వెర్డే (3-2), ఈజిప్ట్ (3-2), క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్ (3-1),సెమీస్‌లో ఇంగ్లాండ్‌ (2-1)పై విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. చివరికి యూరోపియన్ ఛాంపియన్స్ అయిన స్పెయిన్ తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ప్రపంచ కప్‌ను ముద్దాడింది.*


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...