న్యూఢిల్లీ: బూతు మాటలు, దూషణలు, అసభ్య పదజాలం ఉపయోగించినంత మాత్రాన, అవి ఎంత అభ్యంతరకరంగా లేదా సభ్యత లేనివిగా ఉన్నప్పటికీ 'అశ్లీలత' నేరం కిందకు రావని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 294 కింద ట్రయర్ కోర్టు తనకు విధించిన శిక్షను హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం, కేవలం తిట్టడం లేదా అసభ్య పదజాలం వాడడం మాత్రమే ఐపీసీ సెక్షన్ 294 కింద అశ్లీలత నేరంగా మారదని పేర్కొంది.
No comments:
Post a Comment