Friday, 11 September 2026


మనుషులు మమతలు (1965)

యద్దనపూడి సులోచనారాణి కథ ఆధారంగా 1965 ఆగస్టు 27 న విడుదలయిన మనుషులు మమతలు చిత్రం మానవ సంబంధాల భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించింది. సినిమాకు ఆత్రేయ పదునైన మాటలు రాశారు. విజయ, సురేష్, అన్నపూర్ణ లాంటి సంస్థలకు ధీటుగా సినిమాలు నిర్మించిన ప్రసాద్ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవీ సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రానికి కే. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది.

జమీందార్ రాజారావు (గుమ్మడి)కి తన ఏకైక కుమార్తె రాధ (సావిత్రి) అంటే ఎంతో ప్రేమ. గోదావరి వరదల సమయంలో అతను వేణు (ఏఎన్ఆర్),  అతని తల్లి కనకమ్మ ( హేమలత)లకు ఆశ్రయం కల్పిస్తాడు. చిన్నప్పటి నుంచి వేణు, రాధ స్నేహంగా ఉంటారు. రాధ అతడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతుంది. రాజారావుకు దుర్మార్గుడైన మేనల్లుడు శేషు (ప్రభాకర రెడ్డి) రాధను వివాహం చేసుకోవాలనే దురుద్దేశంతో ఉంటాడు. కానీ తన ప్రయత్నం ఫలించక పోవడంతో పగతో ఉంటాడు. రాజారావుకు అత్యంత సన్నిహితుడైన గోపాలరావు ( రమణారెడ్డి) ఒక చీఫ్ ఇంజనీర్. అతను తన కుమార్తె ఇందిర జయలలిత), చనిపోయిన తన సోదరుడి కుమారుడు భాస్కర్‌ (జగ్గయ్య)తో ఉంటాడు. భాస్కర్, రాధ పెళ్లి సంబంధాన్ని కుదర్చడానికి గోపాలరావు ప్రయత్నిస్తాడు. అప్పుడు, రాధ వేణుకు పెళ్లి ప్రతిపాదన చేస్తుంది, కానీ ఇంజనీర్ కావాలనేది తన కల ఆశయం కావడంతో, వివాహం తన లక్ష్యానికి ఆటంకం కలిగిస్తుందని అతను అంగీకరించడు. అందువల్ల, రాధ భాస్కర్‌ను వివాహం చేసుకుంటుంది. ఆమె సహాయంతో, వేణు ఉన్నత చదువుల కోసం గోపాలరావు వద్దకు వెళ్తాడు, అక్కడ ఇందిర అతడిని ఇష్టపడి, దగ్గరవ్వడం మొదలుపెడుతుంది,భాస్కర్ సాగర్ డ్యామ్కాంట్రాక్టును పొందుతాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న శేషు, తన ప్రియురాలు వాణి ( రాజశ్రీ) ద్వారా భాస్కర్‌ను తన వలలోకి లాగి, అతనికి చెడు అలవాట్లను చేస్తాడు. అతడి కాంట్రాక్ట్ అధికారాన్ని  చేజిక్కించు కుంటాడు. వేణు సాగర్ డ్యామ్‌కు చీఫ్ ఇంజనీర్ గా వచ్చి శేషు లోపభూయిష్టమైన నిర్మాణ మోసాన్ని బయటపెట్టి, వారి బిల్లులను చెల్లించకుండా నిలిపివేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ వేణు నమ్మకద్రోహి అని ఆరోపించగా, రాధ అతని వద్దకు వెళ్తుంది. అక్కడ, అతను అసలు నిజాన్ని వెల్లడించగా, ఆమె తన భర్త నీతిమంతుడేనని చెబుతుంది. వేణు, రాధల మధ్య ఉన్న సంబంధాన్ని శేషు తప్పుగా ప్రచారం చేయబోతే భాస్కర్ అతడిని కొట్టి బయటకు గెంటేస్తాడు. వాణి కూడా భాస్కర్‌కు తన తప్పును అర్థమయ్యేలా చేసి, అతడిని ఇంటికి పంపుతుంది. ఆగ్రహించిన శేషు వంతెనను పేల్చివేయడానికి కానీ వేణు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి దానికి అడ్డుగా నిలుస్తాడు. చివరగా, రాధ మాట మీద వేణుకు ఇందిరతో వివాహానికి నిశ్చితార్థం జరుగుతుంది. 

తాతినేని చలపతిరావు అందించిన ఈ చిత్రంలో అన్ని పాటలూ హిట్టే. జయలలిత ఈ తొలి చిత్రంతోనే హీరోయిన్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రసాద్ బ్యానర్ లోనే అక్కినేనికి జోడీగా బ్రహ్మచారి, ఆదర్శ కుటుంబం, భార్యాబిడ్డలు, నాయకుడు- వినాయకుడు చిత్రాల్లో నటించింది. *


No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...