Thursday, 17 September 2026


 మనసే మందిరం (1966)

శ్రీ కృష్ణ సాయి ఫిల్మ్స్ పై సీ వీ శ్రీధర్ దర్శకత్వంలో ఎర్రా అప్పారావు నిర్మించిన మనసే మందిరం చిత్రం అక్కినేని, సావిత్రి, జగ్గయ్య నటనను అద్భుతంగా ఆవిష్కరించింది. దర్శకుడు శ్రీధర్ తాను 1962 లో తమిళంలో తీసిన ‘నెంజిల్ ఓర్ ఆలయం‘ రీ మేక్ గా 1963 లో హిందీలో ‘దిల్ ఏక్ మందిర్‘ ను, 1966లో తెలుగులో ‘మనసే మందిరం‘ చిత్రాన్ని  అందించారు.

జీవితాన్ని క్యాన్సర్ వృత్తికే అంకితం చేసిన డాక్టర్ రఘు (ఏఎన్ఆర్) ఆస్పత్రికి అతని మాజీ ప్రేయసి సీత (సావిత్రి) తన క్యాన్సర్ భర్త రామూ (జగ్గయ్య)ను తీసుకుని వస్తుంది. అయితే తనపై ఉన్న ప్రేమ కారణంగా రఘు తన భర్తకు సరిగ్గా చికిత్స చేయలేడని సీత అనుమానిస్తుంది. కానీ రాముకు నయం చేస్తానని రఘు ఆమెకు హామీ ఇస్తాడు. వారి సంభాషణను విన్న రాము గతంలోని వారు ప్రేమికులని తెలుసుకుంటాడు. తన మరణానంతరం రఘును పెళ్లి చేసుకోవాలని సీత నుంచి వాగ్దానం తీసుకుంటాడు. రాముకు శస్త్రచికిత్సను చేయాల్సిఉన్న డాక్టర్ రఘు సీత కారణంగా తాను పక్షపాతంగా ఉన్నానని అనిపిస్తుందేమోనని, శస్త్రచికిత్సలో విఫలం కాకూడదనే భావనతో తీవ్ర సంఘర్షణకు లోనవుతాడు.  ఆహారం, నిద్ర లేకుండా ఎంతో మంది కష్టం మీద రాముకు శస్త్రచికిత్సను విజయవంతంగా చేస్తాడు. కానీ అతడు తీవ్ర రక్తపోటుతో మరణిస్తాడు. చ రఘు పేరు మీద రాము,  సీత ఒక స్మారక ఆసుపత్రిని నిర్మించడంతో సినిమా ముగుస్తుంది.

ఎం.ఎస్ విశ్వనాథం సంగీతం అందించిన ఈ చిత్రంలో ఆత్రేయ సిట్యుయేషన్ తగ్గ పాటలు రాశారు. సావిత్రి మానసిక సంఘర్షణకు అనుగుణంగా జగ్గయ్య మీద చిత్రించిన -  తలచినదీ జరిగినదా దైవం ఎందులకు- పాట హృదయలోతులను తాకుతుంది. పీ బీ శ్రీనివాస్ ఈ పాటకు ప్రాణం పోస్తే జగ్గయ్య పాటలో జీవించారు.ప అలాగే భర్త తనను మళ్లీ పెళ్లి చేసుకొమ్మని అడిగినప్పుడు సుశీల పాడే -అన్నది నీవేనా - పాటలో సావిత్రి అభినయం, ఘంటసాల పాడిన చల్లగ ఉండాలి- నీ మది నెమ్మది పొందాలి- పాటలో అక్కినేని హావభావాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 


No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...