Tuesday, 1 September 2026

 తల్లా పెళ్ళామా (1970)



ఎన్ఏటీ, రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై  ఎన్టీఆర్ కథ, చిత్రానువాదం, సమర్పణ, దర్శకత్వంలో 1970 జనవరి 8వ తేదీన విడుదలైన ‘తల్లా పెళ్ళామా’ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. నందమూరి త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. సముద్రాల రామానుజాచార్యులు మాటలు రాశారు.

పేదవాడైన హీరో (ఎన్టీఆర్)ని ఓ కోటీశ్వరుని (రేలంగి ) కూతురు (చంద్రకళ )ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఆ తరువాత భర్తను అత్తకు (శాంతకుమారి )దూరం చేసి తనతో తీసుకువెళ్తుంది. దూరమైన కన్నతల్లి ఆవేదనను అర్థం చేసుకున్న తనయుడు భార్యను ఎలా దారిలో పెట్టాడు అన్నదే ఈ కథ. దేవిక, నాగభూషణం, రమణారెడ్డి, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఇందులో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ బాలనటునిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 

ఈ చిత్రానికి సి.నారాయణ రెడ్డి, కొసరాజు పాటలు రాయగా టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. అప్పట్లో జై ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో ‘విశాలాంధ్ర’ ను సమర్ధిస్తూ సినారే చేత తెలుగు జాతి మనది పాట రాయించారు ఎన్టీఆర్. బంగారు గూటిలోని చిలకా, మమతలెరిగిన నా తండ్రి, బ్రహ్మం తాత చెప్పింది పాటలు కూడా బాగుంటాయి. ఇందులో మహ్మద్ రఫీ కూడా ఓ పాట ( నీవు నవ్వుతున్నావు) పాడారు.*


No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...