హైద్రాబాద్ కు చెందిన గజల్ సింగర్ బి. శంకర్ రావు ( బీ శంకర్)చాలా తక్కువ సినిమాలకు సంగీతం అందించారు. ఆయన సంగీతం అందించిన సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చుగానీ … ఆయన సంగీతం మాత్రం ఫెయిల్ కాలేదు.
అమాయకుడు, అల్లుడే మేనల్లుడు, చల్ మోహనరంగ, మనుషులు - మట్టి బొమ్మలు చిత్రాల్లో శంకర్ మంచి హిట్స్ ఇచ్చారు.
వింత ఇల్లు సంతగోల, పెళ్లికాని తండ్రి , ఇల్లు వాకిలి , సమాజం చేసిన పెళ్లి, దెబ్బకుఠా దొంగల ముఠా చిత్రాలకు కూడా శంకర్ సంగీతం అందించారు.
శంకర్ బాణీల్లో గజల్ సొగసులు కూడా కనిపిస్తాయి.
బి.శంకర్ తో గజల్స్ పాడించుకుని వినడం ఎమ్మెస్వీకి చాలా ఇష్టంట.!
No comments:
Post a Comment